బ్రతుకు బాటలో
మెతుకు వేటలో
మనసుకి నచ్చిన పని దొరక్క
దొరికిన పని మనసుకి నచ్చక
తన అస్తిత్వాన్ని కోల్పోతూ
తనలోని భావాల్ని అణచిపెడుతూ..
అనుక్షణం..
విరుద్ధ భావాల ఒరిపిడిలో నలిగిపోతూ
కాసుల వేటలో కరిగిపోతూ...
బ్రతుకు బండిని భారంగా నెడుతూ..
యాంత్రికంగా మారిన జీవితాల్లో
ప్లాస్టిక్ నవ్వులూ, ప్రొఫెషనల్ పలకరింపులూ..
పెరుగుతున్న స్నాతకోత్తర చదువులు..
తగ్గుతున్న ఇంద్రియ స్పృహలు..
అనుక్షణం పోరాటం
మనిషి మనుగడకై ఆరాటం..
మెతుకు వేటలో
మనసుకి నచ్చిన పని దొరక్క
దొరికిన పని మనసుకి నచ్చక
తన అస్తిత్వాన్ని కోల్పోతూ
తనలోని భావాల్ని అణచిపెడుతూ..
అనుక్షణం..
విరుద్ధ భావాల ఒరిపిడిలో నలిగిపోతూ
కాసుల వేటలో కరిగిపోతూ...
బ్రతుకు బండిని భారంగా నెడుతూ..
యాంత్రికంగా మారిన జీవితాల్లో
ప్లాస్టిక్ నవ్వులూ, ప్రొఫెషనల్ పలకరింపులూ..
పెరుగుతున్న స్నాతకోత్తర చదువులు..
తగ్గుతున్న ఇంద్రియ స్పృహలు..
అనుక్షణం పోరాటం
మనిషి మనుగడకై ఆరాటం..
No comments:
Post a Comment